Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి..!

District collector : పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత అధికారులను వివరణ కోరారు.

దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరుగుతున్నడంపై ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్దూర్, కోస్గి మండలాలలోనే అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉండడంపై ఆమె ఆ మండలాల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సున్నితంగా హెచ్చరిస్తూ త్వరితగతిన పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి కిరణ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ కు యాప్ లో ఉత్పన్నమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ దశలను క్లుప్తంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మక్తల్ తహాసిల్దార్ సతీష్ కుమార్, మరికల్ ఎంపీడీవో పావని, మద్దూర్ , కోస్గి, నారాయణపేట, ధన్వాడ, మరికల్, నర్వ, ఊట్కూరు, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల ఆర్.ఐ.లు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు