District collector : భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్..!
District collector : భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్..!
జగిత్యాల, (మన సాక్షి) :
నేషనల్ హైవే63 నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. బుధవారం కోరుట్ల మండలంలోని మోహనరావుపేట్, గ్రామ సమీపంలోని , జగిత్యాల మండలంలోని తాటిపల్లి, శివారులో జాతీయ రహదారుల అధారిటీ అదికారులు చేస్తున్న సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టాలని, ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి, ఇండ్లు, కట్టడాలు, బోర్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, వాటికి చెల్లించాల్సిన నష్ట పరిహారం అంచన విలువలను ఆయాశాఖల అధికారులు సమన్వయంతో కలిసి పూర్తి చేయాలన్నారు.
ఇప్పటి వరకు చేపట్టిన సర్వేలో భూములు కోల్పోతున్న వారు తెలిపిన అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొని భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్, సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
TG News : పూణే లో ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ కు మన విద్యార్ధి..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
-
High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ నిరోధించడానికి ఆహారంలో ఇవి తీసుకోండి.. గుండె సురక్షితం, జబ్బులు దూరం..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!









