Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : పండుగ రోజు విషాదం, ధాన్యం ట్రాక్టర్ రాంగ్ రూటు.. మిర్యాలగూడలో నిండు ప్రాణం బలి..!

BREAKING : పండుగ రోజు విషాదం, ధాన్యం ట్రాక్టర్ రాంగ్ రూటు.. మిర్యాలగూడలో నిండు ప్రాణం బలి..!

వేములపల్లి, మన సాక్షి

దీపావళి పండుగ రోజు విషాదం నెలకొన్నది. ధాన్యం ట్రాక్టర్ల రాంగ్ రూటు వల్ల నిండు ప్రాణం పోయింది. వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలోని హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారిపై గురువారం ప్రమాదం సంభవించింది.

మిర్యాలగూడ నుంచి వేములపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొని మృతి చెందాడు.

ఎదురుగా దాన్యం ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడం వల్ల దానిని తప్పించబోయి వెనుక నుంచి వస్తున్న లారీ కింద పడి మృతి చెందాడు.

మృతుడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి (36) గుర్తించారు. కాగా వేములపల్లి మండలం తిమ్మారెడ్డి గూడెం లో అక్కని పండగకు తీసుకురావడానికి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయింది. సంఘటన స్థలాన్ని వేములపల్లి పోలీసులు పరిశీలించి విచారణ చేపడుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు