Group -3 : గ్రూప్- 3లో 1388 ఖాళీలు, భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Group -3 : గ్రూప్- 3లో 1388 ఖాళీలు, భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదల..!
మన సాక్షి:
తెలంగాణలో గ్రూప్ -3 ద్వారా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 17, 18 వ తేదీలలో గ్రూప్ -3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
నవంబర్ 17వ తేదీన రెండు పేపర్లకు రెండు సెషన్స్ నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.
అదే విధంగా 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. కాగా గ్రూప్ -3 పరీక్ష రాసే అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కూడా అధికారిక వెబ్ సైట్ లో వివరాలు తెలియజేశారు.
కాగా తెలంగాణలో గ్రూప్ -3 ఉద్యోగాలను 1388 ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,36, 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఉండగా పరీక్షల తేదీలను టీజీఎస్పి తాజాగా ప్రకటించింది.
LATEST UPDATE :
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి శుభవార్త..!
-
Miryalguda : వీళ్లు మామూలోళ్లు కాదు.. రెండేళ్లుగా.. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీలు.. అరెస్టు చేసిన పోలీసులు..!
-
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
-
Good News : మహిళలకు దీపావళి శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్.. దరఖాస్తు ఇలా..!









