Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Murder : అల్లుడిని హత్య చేసిన అత్త.. అరెస్ట్..!

Murder : అల్లుడిని హత్య చేసిన అత్త.. అరెస్ట్..!

నారాయణఖేడ్, మన సాక్షి ప్రతినిధి:

కూతురిని నిత్యం వేధిస్తున్నడనే కారణంతో ఓ అత్త అల్లుడిని హత్య చేసిన సంఘటన నారాయణఖేడ్ మండలం పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

నారాయణఖేడ్ మండలం పరిధిలోని సంజీవ రావ్ పేట గ్రామానికి చెందిన లావణ్యకు ర్యాలమడుగు గ్రామానికి చెందిన మహేష్ కు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా మద్యానికి బానిసైన మహేష్ భార్యను అనుక్షణం వేధించడంతో పాటు తన తండ్రి చనిపోగా వచ్చిన డబ్బులను మొత్తం దుబారాగా ఖర్చు పెట్టేశాడని, మిగిలి ఉన్న రెండు ఎకరాల భూమిని సైతం అమ్మి వేస్తానని చెప్పడంతో లావణ్య తన ముగ్గురు పిల్లలు తీసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన లావణ్య తల్లి వీరమణి ఎలాగైనా అల్లుడిని చంపితేనే తన కూతురు జీవితం బాగుపడుతుందని, పథకం ప్రకారం తనకు తెలిసిన నర్సాపూర్ వ్యక్తి కిష్టతో కలిసి నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివాలోని మెట్రో డాబా పక్కకి తీసుకెళ్లి బాగా మద్యం తాగించి తను లేవలేని పరిస్థితుల్లో ఉండగా ఒక బండ రాయితో తలకు రెండు వైపుల గట్టిగా కొట్టడంతో మహేష్ అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయాడు.

విచారణంలో నిందితురాలు వీరమణి ఒప్పుకున్నట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి,ఎస్సె విద్యా చరణ్ రెడ్డి తెలిపారు. కాగా హత్య చేసిన వీరమణిని ఆమెకు సేకరించిన నర్సాపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య ను రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు