Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయాలని అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై భారీగా రైతుల రాస్తారోకో..!
Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయాలని అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై భారీగా రైతుల రాస్తారోకో..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు భారీగా ధర్నా చేశారు. సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గం లోని వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రైతులు భారీగా రాస్తారోకో చేశారు.
మిల్లర్లు వివిధ కోర్రీలు పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. నెంబర్ వన్ ధాన్యం ఉన్నప్పటికీ కూడా 2200 నుంచి 2300 రూపాయల వరకే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి తనిఖీ చేయడం వల్ల కేవలం కొద్దిసేపు మాత్రమే క్వింటాకు 2400 రూపాయలు చెల్లించారని రైతుల పేర్కొన్నారు. తిరిగి యధావిధిగా తేమ శాతం సాకుతో 2200, 2300 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాగా రైతుల ఆందోళనల విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం శెట్టిపాలెంలోని మహేంద్ర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితులలో రైతులకు మద్దతు ధర చెల్లించాలని మిల్లర్లను ఆదేశించారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MOST READ :









