Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ మౌలిక వసతులపై ప్రణాళిక రూపొందించాలి.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశం..!

Nalgonda : నల్గొండ మౌలిక వసతులపై ప్రణాళిక రూపొందించాలి.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి.

నల్గొండ మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో కావాల్సిన మౌలిక వసతులపై ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలో నూతన డంపింగ్ యార్డ్ నిర్మాణానికి స్థలాన్ని చూడాలని, స్లాటర్ హౌస్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ లేకుండా చూడాలని, పట్టణం చుట్టూ మినీ డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేయాలని అలాగే నల్గొండ మున్సిపాలిటీలో పారిశుధ్యంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని అన్నారు.

ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ కార్యాలయంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నూతన బ్లాక్ ను నిర్మించేందుకు ఇదివరకే మంజూరు చేయడం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా టెండర్లను పిలిచి 6 నెలల్లో ఈ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డైట్ కళాశాల ముందున్న శిథిలావస్థలో ఉన్న ప్రహరీని పూర్తిగా తీసేసి కొత్త ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో మొత్తానికి సెంట్రల్ లైటింగ ను పూర్తి చేయాలని అన్నారు.వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వంద లీటర్ల తాగునీటిని అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని, ఇదివరకే పట్టణంలో పాత వాటర్ ట్యాంకులు 16 ఉండగా, అమృథ్ లో మరో 10 కొత్త ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందుకు తగ్గట్టుగా స్టోరేజ్ కెపాసిటీ పెంచి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.

త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం నాటికి అన్ని ప్రతిపాదనలతో సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అలాగే హాలియా మున్సిపాలిటీకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు ,అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు నాగర్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి ని సంప్రదించి డిపిఆర్ ను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

మిర్యాలగూడ శాసనస సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ ఆబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు