Check Post : కర్ణాటక ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి..!
Check Post : కర్ణాటక ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ చెక్ పోస్ట్ ను మంగళవారం సిఐ శివశంకర్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
సీఐ శివ శంకర్ మాట్లాడుతూ ఖరీఫ్ కొనుగోలులో వరి ధాన్యాన్ని కర్ణాటక రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాలోకి రాకుండా నివారించేందుకు నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లా కేంద్రానికి వరి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చెక్దదోస్తీ దగ్గర ఉండి పోలీస్ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనా నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని వాహనాలకు సంబంధించిన నెంబర్లను రికార్డులో నమోదు చేయాలని సూచించారు.
24/7 డ్యూటీలో ఉండే పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారి డిటి. కాళప్పతదితరులు ఉన్నారు.
MOST READ :









