CM Revanth : ఆదానికి సీఎం రేవంత్ రెడ్డి షాక్.. రూ.100 కోట్లు రిటర్న్..!
CM Revanth : ఆదానికి సీఎం రేవంత్ రెడ్డి షాక్.. రూ.100 కోట్లు రిటర్న్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదానికి షాక్ ఇచ్చారు. ఆదాని గ్రూప్ స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని రిటర్న్ చేస్తూ లేఖ రాశారు. సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద స్కిల్స్ వర్సిటీకి ఆదాన్ని గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల రూపాయలను బదిలీ చేయవద్దని కోరుతూ ఆ గ్రూప్ కు లేఖ పంపారు.
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో లక్షలాదిమంది నిరుద్యోగులకు టెక్నికల్ స్కిల్స్ నేర్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు తెలిపారు. అలాంటి స్కిల్ యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, తనకు, ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.
స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన ఆదాని గ్రూప్ విరాళాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే ఆదాని నుంచి పెట్టుబడులను అనుమతిస్తాం.. నియమ నిబంధనల మేరకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం, దేశంలో ఏ సంస్థల కైనా చట్టబద్ధంగా బిజినెస్ చేసుకునే హక్కు ఉంటుంది. అంబానీ, ఆదాని, టాటా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!
-
TG News : తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. 3500 ఖాళీ పోస్టులు..!









