Cm Revanth Reddy: అదే జరిగితే కవిత ముఖ్యమంత్రి అవుతారు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్..!
Cm Revanth Reddy: అదే జరిగితే కవిత ముఖ్యమంత్రి అవుతారు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్..!
మన సాక్షి వెబ్ డెస్క్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలుకెళ్ళినవారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ముందు కవిత అవుతారని అన్నారు.
ఆదాని కి గతంలో ఎన్నో ప్రాజెక్టులు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఆదానితో కేసీఆర్ సర్కార్ అంట కాగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదాని వద్ద వాళ్లు కమిషన్లు తిన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నాడని అన్నారు.
జైలుకెళ్తే ముఖ్యమంత్రి అవ్వచ్చనే అనుకుంటున్నాట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే కవిత జైలుకెళ్లారు.. జైలుకెళ్ళిన వారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ముందు కవిత అవుతారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.
అదేవిధంగా తన ఢిల్లీ పర్యటనతో పాలిటిక్స్ కు సంబంధం లేదని లోకసభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసం ఢిల్లీ టూర్ వెళ్లినట్లు చెప్పారు. 28 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారని అన్నారు.
నేను వారిలా పైరవీలు చేయడానికో, బెయిల్ కోసమో ఢిల్లీకి వెళ్లలేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావలసినవి రాబట్టు కోవాలి.. అవసరమైతే ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా వెళ్తామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
MOST READ :
-
CM Revanth : ఆదానికి సీఎం రేవంత్ రెడ్డి షాక్.. రూ.100 కోట్లు రిటర్న్..!
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!









