Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మాడుగులపల్లి, మన సాక్షి:

మాడుగులపల్లి మండలంలోని కుక్కడంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు కూరగాయలను పరిశీలించి శుచీ,శుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విద్యా బోధన మధ్యాహ్నభోజన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు గృహోపకరణాలతో విద్యను బోధించాలని అధ్యాపకులకు ఆదేశించారు అదేవిధంగా నాణ్యమైన భోజనాన్ని అందించాలని భోజన నిర్వాహకులకు సూచించారు.

అనంతరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పరిశీలించి తాసిల్దార్ కార్యాలయం మరియు మండల పరిషత్ కార్యాలయాల భవనాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట మండల తాసిల్దార్ పద్మ, ఎంపీడీవో తిరుమల స్వామి, ఎంఈఓ వెంకటమ్మ, పాఠశాల ఎస్ ఓ వసంత, ఆర్ఐ రేణుక, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు