Suryapet : హుజూర్ నగర్ బస్టాండ్ కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయి..!
Suryapet : హుజూర్ నగర్ బస్టాండ్ కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయి..!
హుజూర్ నగర్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రాష్ట్ర పౌరసరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నూతన భవనం నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం హుజూర్ నగర్ పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ లను పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 120 ఎకరాలో దాదాపుగా 2000 వేల డబల్ బెడ్ రూమ్ గృహాలు పూర్తి కావచ్చాయని, నాకు కుటుంబం అంటూ లేదు మీరే నా కుటుంబం అని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా హుజుర్ నగర్ బస్ స్టాండ్ ను తీర్చిదిద్దుతామని, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు విచ్చేసి మాట్లాడుతూ 40ఏండ్ల క్రితం కట్టిన బస్ స్టాండ్ ను పునర్నిర్మాణం చేస్తామని అదనపు ప్లట్ పామ్, షాపింగ్ కాంప్లెక్స్, బస్ స్టాండ్ ముందు పెట్రోల్ బంక్ నిర్మాణాలను చేపడుతామని హుజుర్ నగర్ బస్ స్టాండ్ కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయి.
మరిన్ని బస్సు సౌకర్యాలు పెంచేలా ప్రణాళికలు చేస్తాం ఉచిత బస్ తో 60లక్షల మంది ప్రయాణం చేస్తుంటే వాటిలో మహిళలే 36లక్షల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఏడాది పాలనలో మహాలక్ష్మి పధకం ప్రారంభించిన నాటి నుండి కోటి, 16లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు.
రూ.4వేల కోట్లు విడుదల చేసింది భవిష్యత్ లో 116కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం 10ఏండ్లలో ఒక్క కొత్త బస్సు లేదు కాంగ్రెస్ అధికారం వచ్చాక ఆర్టీసీ బస్సు లాభాల బాటలో పయనిస్తోంది.ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించం త్వరలోనే బస్ స్టాండ్ నిర్మాణా పనులను ప్రారంభిస్తాం బస్సుల రాకపోకలు ఇబ్బందులు లేకుండా 50ఏండ్ల వరకు ఇబ్బందులు లేకుండా అధునాతన పద్ధతులతో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి ఆర్చన, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!









