Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Cm Revanth Reddy : ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే నల్లగొండ నిర్లక్ష్యం..!

Cm Revanth Reddy : ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే నల్లగొండ నిర్లక్ష్యం..!

మన సాక్షి, నల్గొండ :

ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే పదేళ్లపాటు నల్లగొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని గంధంవారి గూడెంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధుల ఖిల్లా అన్నారు. కాంగ్రెస్ పాలనలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేస్తుందన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో నల్లగొండ పాత్ర కీలకమైంది అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్య మంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవిని త్రుణ ప్రాయంగా వదిలేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

44 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేశామని, లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ కు శాశ్వత నిర్మూలన జరిగేదన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు