TOP STORIESBreaking Newsజాతీయంసంక్షేమం

PM Modi : 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రధాని మోడీ భారీ శుభవార్త.. నెలకు రూ.21 వేలు, కొత్త పథకం..!

PM Modi : 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రధాని మోడీ భారీ శుభవార్త.. నెలకు రూ.21 వేలు, కొత్త పథకం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు భారీ శుభవార్తను అందించనున్నారు. మహిళల సాధికారత ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. దేశంలో పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టే ఈ పథకాన్ని డిసెంబర్ 9న హర్యానా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం పేరు ఎల్ఐసి బీమా సఖి యోజన. దీని ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందడంతో పాటు మహిళల సాధికారత లక్ష్యంగా ప్రవేశపెడుతున్నారు. ఈ పథకంలో మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేర్చి వారికి నెల నెలా స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తారు. దాంతో మహిళలకు ప్రతినెలా 7వేల రూపాయల నుంచి 21 వేల రూపాయల వరకు అందనున్నాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు మహిళలు ఇందులో పాల్గొనవచ్చును. అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. వారికి ఈ రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ, స్టైఫండ్ కూడా ఇవ్వబడుతుంది.

శిక్షణ తర్వాత మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చును. గ్రాడ్యుయేట్ బీమా సఖీలు కూడా ఎల్ఐసి లో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన మొదట్లో మహిళలకు 7000 రూపాయలను అందజేస్తారు. రెండవ ఏడాది 6000 పెంచి మరో ఏడాది 5000 రూపాయలను ప్రతినెల అందజేస్తారు. టార్గెట్ పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమిషన్ కూడా ఇవ్వబడుతుంది. ఈ పథకం మొదటి దశలో 35 వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు. తర్వాత మరో 50 వేల మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు.

MOST READ :

మరిన్ని వార్తలు