Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsfoodజాతీయం

Onion : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు..!

Onion : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఉల్లిగడ్డ ధరలు మరోసారి సామాన్యులకు షాక్ కలిగిస్తున్నాయి. ఇప్పుడున్న ధరలు కాకుండా మరో వారం, పది రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. వారం రోజుల క్రితం కిలో ఉల్లిగడ్డ 30 రూపాయల నుంచి 40 రూపాయలకు విక్రయించిన వ్యాపారులు ప్రస్తుతం కిలో ధర రూ. 70 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తున్నారు.

ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో మరింతగా పెరగవచ్చని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఉల్లిగడ్డ సాగు చేసే రైతులు తక్కువగా ఉండటం వల్లనే అధిక ధరలకు కారణమవుతుందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో ఉల్లిగడ్డ ధర సెంచరీ కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.

ఉల్లిగడ్డ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. నెల రోజుల క్రితం ఉల్లి మడి ధర 500 రూపాయలు పలికింది. ప్రస్తుతం రూ.2500 నుంచి రూ. 3000 రూపాయల వరకు పలుకుతుంది. కొన్ని విత్తనాల రేటు కూడా కిలో 150 రూపాయల నుంచి 600 రూపాయలకు పెరిగింది.

కాగా ఉల్లి సాగు చేయడానికి ఒక ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. సాగు ధరలు పెరగడం, తక్కువగా సాగు చేయడం కారణంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ముఖ్యమైన వార్తలు

Rythu : రైతులకు డబుల్ బొనాంజ.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!

Gold Price : పసిడి పతనం.. భారీగా రూ.9800 తగ్గిన ధర, తులం ఎంతంటే..!

TG News : ధరణి పోర్టల్ సేవలు బంద్..!

Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్..!

మరిన్ని వార్తలు