Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూల్స్ పాటించకపోతే కేసులు.. డిఎస్పి వెల్లడి..!
Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూల్స్ పాటించకపోతే కేసులు.. డిఎస్పి వెల్లడి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశానుసారం మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, టూ టౌన్ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలో భాగంగా పర్యటించారు.
ట్రాఫిక్ అంతరాయం కలగకూడదని డాక్టర్స్ కాలనీలో ప్రతి ఒక్క హాస్పిటల్ నిర్వాహకులు మెడికల్ షాప్ వారు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని లేనియెడల కేసులు నమోదు చేస్తామన్నారు. డాక్టర్స్ కాలనీలో హాస్పిటల్ నిర్వాహకులు, మెడికల్ షాపు వారు రోడ్ల పై ఏర్పాటు చేసినటువంటి బోర్డులను ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ యాదవ్ పోలీస్ సిబ్బందితో కలిసి తొలగించారు.
అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ డాక్టర్స్ కాలనీలోకి రావాలి అంటే వాహనాలను రోడ్లపై నిలుపుదల చేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి బోర్డులను ఏర్పాటు చేసిన, వాహనములను రోడ్లపై పార్కు చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారి వెంట ట్రాఫిక్ సిబ్బంది చంద్రశేఖర్ క్రాంతికుమార్ నాగరాజు సుమన్ అక్రమ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ ;
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
-
TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నేడే జాబ్ మేళా..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!









