District collector : ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్..!
District collector : ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్..!
జగిత్యాల, మన సాక్షి :
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో గల ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా ప్రాథమిక పశువైద్య కేంద్రంలో జరుగుతున్న పశువైద్య సేవలు గురించి ఆరా తీసారు. అలాగే పశువైద్య కేంద్రంలో రిజిస్టర్ లను తనిఖీ చేస్తూ పశువైద్య ఆరోగ్య కేంద్రంలో ఉన్న అన్ని వసతుల గురించి పరిశీలించడం జరిగింది.
ముఖ్యంగా వ్యాక్సిన్ స్టోరేజ్ మందుల యొక్క స్టోరేజ్ ని తనిఖీ చేసారు. మందుల యొక్క వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం శాఖా పరంగా జరుగుతున్న అఖిలభారత పశుగణన మండలంలో ఏ విధంగా సాగుతుందో తెలుసుకొని ఆన్లైన్లో దాన్ని పరిశీలించడం జరిగింది.
పశువులను ప్రతి గ్రామంలో కచ్చితంగా ఆన్ లైన్ చేయాలని చెబుతూ దాన్ని త్వరితగతంగా పూర్తి చేయుటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద చేపట్టిన పలు టీకాల వివరాలను రిజిస్టర్ లో మాత్రమే కాకుండా ఆన్లైన్లో నమోదు గురించి వెరిఫై చేయడం జరిగింది. తదనంతరం పశువైద్య సేవలు మరింత పెంచాలని కృత్రిమ గర్భోత్పత్తి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేలు జాతి అభివృద్ధి జరిగేటట్టు చూడాలని ఆదేశించడం జరిగింది.
తదనంతరం జిల్లా కలెక్టర్ కోరుట్ల పట్టణంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని సందర్శించి ప్రాథమిక పశువైద్య కేంద్రం మొదటి అంతస్తులో ఉండడంవల్ల పశుపోషకుల ఇబ్బందులను దృష్టిలొ ఉంచుకొని పూర్తి ఏర్పాట్లు చేయాలని మండల తాహసిల్దార్, పట్టణ కమిషనర్లను ఆదేశించడం జరిగింది. అలాగే కోరుట్ల మండల పశువైద్యాధికారిని కూడా తాసిల్దార్ తో కలిసి కోరుట్ల పట్టణంలో తాత్కాలిక నిర్వహణకు అనువైన ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ ఎల్ మనోహర్, సహాయ సంచాలకులు డాక్టర్ బి నరేష్, పశువైద్య కేంద్ర పశువైద్యాధికారి డాక్టర్ మనీషా, డాక్టర్ సంతోష్ , పశు వైద్య సిబ్బంది, మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ , కోరుట్ల ఆర్డిఓ జీవాకర్, సంబంధిత తహసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
-
TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నేడే జాబ్ మేళా..!
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!









