Jagityal : కేంద్ర హోం మంత్రి అమిత్ షా వాఖ్యలపై అంబేద్కర్ యూత్ నిరసన..!
Jagityal : కేంద్ర హోం మంత్రి అమిత్ షా వాఖ్యలపై అంబేద్కర్ యూత్ నిరసన..!
మల్లాపూర్, (మన సాక్షి) :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పూలేరి రాము మాట్లాడుతూ బుధవారం జరిగిన శీతాకాల సమావేశాలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ జపిస్తున్నారు.అదే భగవంతుని జపిస్తే ఏడు జన్మల వరకు స్వర్గానికి చేరుతారు.
అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను హోం శాఖ మంత్రి ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పులేరి రాము, ఉపాధ్యక్షులు నల్ల లక్పతి, కోశాధికారి పెద్దిరెడ్డి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి భూరం వంశీ, రైటర్ ఆకుతోట నర్సయ్య, నల్ల రాజేశ్వర్, మాట్ల సోమయ్య, మాట్ల శ్రీనివాస్,కొంపల్లి రాకేష్,రామ లక్ష్మణ్, మాట్ల అంజయ్య, మాట్ల దినేష్ ,అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
MOST READ :
-
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
-
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూల్స్ పాటించకపోతే కేసులు.. డిఎస్పి వెల్లడి..!









