Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Nalgonda : ఆర్టిఫీసీయల్ ఇంటెలిజన్స్ పై శిక్షణ.. భవేష్ మిశ్రా..!

Nalgonda : ఆర్టిఫీసీయల్ ఇంటెలిజన్స్ పై శిక్షణ.. భవేష్ మిశ్రా..!

నల్గొండ, మనసాక్షి :

నల్గొండ ఐటీ టవర్ ద్వారా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ డిప్యూటీ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా అన్నారు గురువారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి హైదరాబాద్ రహదారిలో ఉన్న ఐ టి టవర్ ను సందర్శించారు.

నల్గొండ నల్గొండ ఐటీ టవర్ చాలా బాగుందని, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ఉద్యోగులను గుర్తించడంతోపాటు, 20 బ్యాచ్ లు గా విభజించి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ కు సూచించారు. అంతేకాక ఐటి టవర్ లో 500 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో జపాన్ కు చెందిన ఒక కంపెని తన కార్యకలాపాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ఐ టి టవర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలను త్వరితగతిన రూపొందించడమే కాకుండా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనులు సులభతరం అవుతాయని ఆయన చెప్పారు .జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఐ టి టవర్ మేనేజర్ నాగరాజు, ఆర్డిఓ అశోక్ రెడ్డి ,స్థానిక తహసిల్దార్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు