Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Accident: హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో..!

Accident: హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో..!

చింతపల్లి, మనసాక్షి :

హైదరాబాద్ , నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా అతని భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన చింతపల్లి మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నేరడు గొమ్ము మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన బాణావత్ జాను 45 సంవత్సరాలు అతని భార్య బాణావతి మంగి 40 సంవత్సరాలు భార్యాభర్తలు ఇరువురు కలిసి సోమవారం రాత్రి 23 రాత్రిTSO5UF7151 నెంబర్ గల ఆటోను తీసుకొని దాసర్లపల్లి గ్రామం నుండి హైదరాబాద్ కు వెళుతున్నారు.

మంగళవారం ఉదయం తెల్లవారుజామున మార్గమధ్యలో చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ శివారులో కెవిఎస్ స్పిన్నింగ్ మిల్ సమీపంలో హైదరాబాద్ హైవే రోడ్డుపైన Ap16TE4989 నెంబర్ గల రోడ్డుపై ఇలాంటి ఇండికేటర్స్ లేకుండా అజాగ్రత్తగా నడిరోడ్డుపై నిలిపి ఉన్న లారీని మూల మలుపు వద్ద వెనక నుండి హైదరాబాద్ వెళుతున్న ఆటో బలంగా ఢీ కొట్టింది.

దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ బాణావత్ జాను కు తలకు బలమైన గాయాలు కావడంతో బాణావత్ జాను(45) అక్కడికక్కడే మృతి చెందాడు. బాణావత్ జాను భార్య మంగికి ఎడమ చేయి విరిగింది. కళ్ళలో నుండి రక్తం వస్తూ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

బాణావత్ జాను కుమారుడు బాణావత్ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి యాదయ్య పేర్కొన్నారు. మృతుడు బాణావత్ జాను హైదరాబాదులో ఆటో నడుపుతూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నాడు.

MOST READ : 

మరిన్ని వార్తలు