Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంతెలంగాణ

మహిళ కానిస్టేబుల్ తో సహా ముగ్గురు ఆత్మహత్యాయత్నం..!

మహిళ కానిస్టేబుల్ తో సహా ముగ్గురు ఆత్మహత్యాయత్నం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా లో మహిళా కానిస్టేబుల్ శ్రుతి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా అడ్లూరు లోని ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే కానిస్టేబుల్ శ్రుతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారిలో ఎవరెవరున్నారు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు