Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

జనాధారణ పొందుతున్న మనసాక్షి దినపత్రిక.. జిల్లా ఎస్పీ..!

జనాధారణ పొందుతున్న మనసాక్షి దినపత్రిక.. జిల్లా ఎస్పీ..!

నారాయణపేట, మన సాక్షి :

జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో శుక్రవారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మన సాక్షి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు.

నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికల పాత్ర చాలా కీలకమైంది అన్నారు. విశ్వాసనీయ సమాచారాన్ని అందించే పత్రికల్లో మన సాక్షి పత్రిక యజమాన్యానికి జిల్లాఎస్పి శుభాకాంక్షలు తెలిపారు. పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల అని పేర్కొన్నారు.

వివిధ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలనీ, చాలా తక్కువ సమయంలోనే లక్షలాదిమంది ఆదరణను ఈ పత్రిక సంపాదించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మన సాక్షి రిపోర్టర్ రమాకాంత్ మాండ్రే, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు