Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండవైద్యం

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి.. కీలక ఆదేశాలు..!

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి.. కీలక ఆదేశాలు..!

నల్లగొండ, మన సాక్షి:

గర్భిని స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏ ఎన్ సి భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆంటినేటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు.

గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు , అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరే వారు, వారి సహాయకులకు అనువుగా ఉండేందుకుగాను ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.

అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను పరిశీలించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోస్ట్ నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏ సి లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లి ,బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు ,ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు,స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో డిప్రెషన్ పై పని చేస్తూన్నారని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంచి సేవలను అందించిన బెస్ట్ డాక్టర్ కు ప్రతినెల 15000 రూపాయల పారితోషకం ఇచ్చే విధంగా ఇది వరకే ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్ఓ డాక్టర్ పొట్ల శ్రీనివాస్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిజిహెచ్ ఇన్చార్జి సూపరింటిండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపా రాణి, తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి స్థానిక ఐటిఐలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు