Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంవ్యవసాయంసంక్షేమంహైదరాబాద్

Rythu Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే..!

Rythu Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట సహాయం అందజేయడానికి ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నది. జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కాగా అధికారుల పంటల సాగు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కేవలం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే దీనిని చేపడుతున్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో 500 ఎకరాల్లో సాగు చేసిన పంటలను మాత్రం నమోదు చేస్తారు.

ఈ ప్రక్రియ అతివేగంగా జరిగేందుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 8వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. అయితే వ్యవసాయ అధికారులంతా పొలాల బాట పట్టారు.

దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి : 

ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నట్లు చర్చ కొనసాగుతుంది.

శాటిలైట్ సర్వే ద్వారా ప్రత్యేకంగా ఎంపిక చేసిన మండలాల్లో మాత్రమే వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు.

సర్వేలో రైతు పేరు, సర్వేనెంబర్, ఏ రకం పంట వేశారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారని వివరాలు మాత్రమే సేకరిస్తారు.

పంటలు సాగు చేయని భూమి, సర్వే నెంబరు, దాని విస్తీర్ణం వంటి వివరాలను కూడా నమోదు చేస్తారు.

గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10000 రూపాయలను అందజేయగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎకరానికి 12,000 రూపాయలను అందజేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు.

MOST READ :

మరిన్ని వార్తలు