Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

District collector : పది లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : పది లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :-

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గతేడాది పది లో సాధించిన ఉత్తీర్ణత కంటే ఈ సారి మెరుగు పడాలన్నారు. గతేడాది ఉత్తీర్ణత శాతం పెంచడానికి నిర్వహించిన ప్రత్యేక తరగతులు, విధానాలను అమలు చేసి పదిలో వంద శాతం ఫలితాలు రాబట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని కాంప్లెక్స్ హెచ్ ఎం ల తో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు పై ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల వారీగా ఎస్. ఏ -1 ఫలితాలపై సమీక్షించారు. ఎస్ ఎ-1 ఫలితాలు ఆశాజనకంగా లేవని, ఇంకా మెరుగు పడాలని ఆయా పాఠశాలల హెచ్ ఎం లకు సూచించారు.

గతేడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలో అవలంభించిన విధి విధానాల గురించి చర్చించారు. ఈ సారి ముందస్తుగా తగిన ప్రణాళిక రూపొందించుకుని ఫలితాలలో జిల్లా రాంక్యు ను గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలిచేలా విద్యాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె కోరారు.

ముఖ్యంగా వెనక బడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా వ్యక్తిగత శ్రద్ధ చూపి వారిని ఆయా సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కేజిబివీ లు, గురుకులాల్లో క్యాటగిరి వారీగా విద్యార్థుల జాబితాను రూపొందించి సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వెనుక బడిన సబ్జెక్టులలో ముందు ఉండేలా మెలకువలు నేర్పించాలని సూచించారు.

పక్షం రోజుల తర్వాత మళ్ళీ సమీక్ష చేద్దామని, అంతలోపు విద్యార్థుల విద్యా నైపుణ్య సామర్ధ్యాల పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, డీ ఈ ఓ గోవింద రాజులు, మధ్యాహ్న భోజన నిర్వహణ సమన్వయకర్త యాదయ్య శెట్టి, సెక్టరియల్ అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు