తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో ఆదరణ పొందుతున్న మన సాక్షి దినపత్రిక..!

అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో ఆదరణ పొందుతున్న మన సాక్షి దినపత్రిక..!

చింతపల్లి, మన సాక్షి :

నేటి సమాజంలో నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది పత్రిక లేనని పత్రికలు ప్రశ్నించని ఎడల సమాజ అభివృద్ధి కుంటుపడుతుందని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డిలు పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్ లో వారి నివాసంలో 20 25 సంవత్సర,” మన సాక్షి ” నూతన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేసే పత్రికలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని వారు పేర్కొన్నారు.

అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో మన సాక్షి దినపత్రిక అందరి మన్ననలను పొందుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్న పత్రిక” మన సాక్షి ” అని వారు పేర్కొన్నారు. పత్రికతో పాటు యూట్యూబ్ లో కూడా ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న సమస్యలు కూడా వెంటనే ఆన్లైన్లో పొందపరచడం జరుగుతుందన్నారు.

దీంతో ప్రతి సమాచారం ప్రజల ముందుంటుందన్నారు. పత్రికలు ఎప్పుడు సమాజాభివృద్ధి శ్రేయస్సు కోరుతూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రజల పక్షం నిలబడి పని చేసే పత్రికలు ఎప్పుడు మనుగడ పొందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కంకణాల ప్రవీణ, సినీ డైరెక్టర్ కంకణాల గోపీనాథ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, చింతపల్లి మండల మన సాక్షి రిపోర్టర్ పుప్పాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు