Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!
Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ తోపాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో 48,000 కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ గవర్నమెంట్ జాబ్స్ కు పదవ తరగతి అర్హతతో 18 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు ఉంది. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి జనవరి 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఎంపిక విధానం, వేతనం :
గ్రామీణ బ్యాంక్ సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష గాని ఇంటర్వ్యూ గాని నిర్వహించరు. పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఆన్లైన్ లో పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 100 రూపాయలు ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు BPM కి 18,500 వేతనం అందజేస్తారు. అదేవిధంగా ABPM కి 14,500 వేతనం అందజేస్తారు.
కావలసిన సర్టిఫికెట్లు :
కేవలం 10వ తరగతి సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఎస్సి, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. దరఖాస్తులు పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
MOST READ :
-
Suryapet : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి..!
-
Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!
-
Miryalaguda : ఆ దొంగల రూటే సపరేట్.. ఆంధ్రాలో కొట్టేసి.. తెలంగాణలో విక్రయం..!









