గ్రామ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. రికార్డులను పరిశీలించిన డిఎల్పివో..!
గ్రామ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. రికార్డులను పరిశీలించిన డిఎల్పివో..!
కామారెడ్డి జిల్లా దోమకొండ, జనవరి 28, మన సాక్షి:
దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలోని డిఎల్పి ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు రిజిస్టర్ రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డి ఎల్ పి ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ…. దోమకొండ మాజీ గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య పై పంచాయతీరాజ్ చట్టనికీ విరుద్ధంగా గ్రామంలో భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆస్తి మార్పిడి మ్యుటేషన్ చేయడం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
గ్రామంలో భారత్ పెట్రోల్ బంకు, హిందుస్థాన్ పెట్రోలియం బంకు లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం, పెట్రోల్ బంకులకు టాక్స్ జారీ చేయకపోవడం, ఓనర్ షిప్ యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఆన్లైన్లో ఇవ్వకపోవడం , వందల సంఖ్యలో ఖాళీ స్థలాలకు అసెస్మెంట్ నెంబర్ కేటాయించడం, గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం , నిబంధన విరుద్ధంగా బిల్లులు చెల్లించడం, గ్రామపంచాయతీ అడ్వాన్స్ తీర్మానం చేయడంపై ఫిర్యాదు చేశారు .
గత ఐదు నెలల క్రితం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని పూర్తి వివరాలు సేకరించి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని డి ఎల్ పి వో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి సౌజన్య, యాదగిరి , సిబ్బందిఉన్నారు.
MOST READ :
-
District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!
-
District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!
-
Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!









