Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

టెన్త్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థిని కుప్పకూలి మృతి..!

టెన్త్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థిని కుప్పకూలి మృతి..!

కురవి, మన సాక్షి :

పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎం ఆర్ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

డీజే సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు యత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈ ఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు.

MOST READ : 

  1. WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!

  2. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపు.. వచ్చేది అప్పుడేనా..!

  4. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

  5. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు