Nalgonda : కేంద్రీయ విద్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్..!
Nalgonda : కేంద్రీయ విద్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్..!
నలగొండ, మన సాక్షి :
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగడానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ కు ప్రిన్సిపల్ శ్రీనివాసులు విఎంసి మెంబర్లు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమం లో భాగంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పవర్ ప్రజెంటేషన్ తో విద్యాలయం నందు అకాడమిక్స్ లో విజయాలు, జరగవలసిన కార్యక్రమాలు మరియు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ను ను వివరించారు.
పీఎం యాక్టివిటీస్ లో భాగంగా ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను కూడా వివరించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం నల్గొండ లో జరగుతున్న కార్యక్రమాలను, వాటిలో సాధిస్తున్న విజయాలకు ప్రిన్సిపాల్, టీచర్స్ పేరెంట్స్, స్టూడెంట్స్ కి అభినందనలు తెలిపారు. విద్యార్థులు విద్యారంగంలో పైకి రావడానికి టీచర్లు తో పాటు పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలని చెప్పారు.
అనంతరం 53 కెవిఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఖో ఖో లో మెడల్స్ సాధించిన 5 గురు విద్యార్థినులకు హైదరాబాద్ రీజినల్ ఆఫీసు నుంచి వచ్చిన నగదును విద్యార్థినులకు ఇచ్చి అభినందించారు.
ఈ కార్యక్రమంలో విఎంసి నెంబర్స్ శంకరయ్య, అనురాధ, నర్సిరెడ్డి టీచర్లు రవి కుమార్, సందీప్, నెహ్రా లు పాల్గోన్నారు.
MOST READ :









