Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : వీధి కుక్కల దాడి.. చిన్నారులకు తీవ్ర గాయాలు..!

Nizamabad : వీధి కుక్కల దాడి.. చిన్నారులకు తీవ్ర గాయాలు..!

నిజామాబాద్ జిల్లా భీంగల్, మన సాక్షి :

ఆర్మూర్ లో కుక్కలు స్వైర్య విహారం చేశాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో కుక్కల దాడిలో ఆరేళ్ళ లోపు ఉన్న ఇద్దరు బాలుడు వివన్స్, బాలిక హన్సికలను కుక్కలు కరిచాయి. ఇద్దరికి ముఖంపై చేతులపై కుక్కలు ఇష్టారీతిన కరవడంతో తీవ్రంగా రక్తస్రావమై నొప్పి తట్టుకోలేక ఆఇద్దరు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కుటుంబీకులు వెంటనే వారిద్దరిని ఆర్మూ ర్లో లోని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్ళి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం నిజా మాబాద్ తీసుకువెళ్ళాలని వైద్యులు సూచిం చారు. యోగేశ్వర కాలనీలో కిషోర్ (35) తో పాటు మరొక రిని కుక్కలు కరిచి గాయపరిచాయి.

కుక్కలు స్వైర్య విహారం చేసి నలుగురిని గాయపరిచిన సంఘటన దావనంలా వ్యాపించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ లో ఇటీవల కుక్కల బెడద తీవ్రమైంది. మూడు నెలల క్రితం శివాజీ చౌక్, గోల్ బంగ్లా, పెద్దబజార్, చిన్నబజార్ సమీపంలో ఒకే రోజు కుక్కలు 11 మంది చిన్నారులను కరిచి గాయపరిచాయి.

మళ్ళీ ఒకే రోజు నలుగురిని కరిచిగాయపరిచాయి. ఆర్మూర్ లో కుక్కలను నియంత్రించే విధంగా మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!

  2. Nalgonda : కేంద్రీయ విద్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!

  5. పట్టపగలు నాలుగు లక్షలు చోరీ..!

మరిన్ని వార్తలు