Penpahad : కాలేశ్వరం జలాలు రాక ఎండిన పంట పొలాలు.. పశువుల మేపుతున్న రైతులు..!
Penpahad : కాలేశ్వరం జలాలు రాక ఎండిన పంట పొలాలు.. పశువుల మేపుతున్న రైతులు..!
పెన్ పహాడ్ ఫిబ్రవరి 08 మనసాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలో శ్రీరామ్ సాగర్ కాల్వల ద్వారా కాలేశ్వరం జలాలు రాక వరి పొలాలను పలు గ్రామాలలో రైతులు పశువుల మేపుతున్నారు. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని ధూపహాడ్, న్యూ బంజర హిల్స్, నూర్జంపేట, చీదెళ్ల, మల్కాపురం ,గూడెపుగుంట, చెట్ల ముకుందాపురం, వివిధ గ్రామాలలో మరియు తండాలలో కొన్ని వందల ఎకరాల పొలాలు కాలేశ్వరం జలాలు రాక ఎండిపోతున్నాయి,
శనివారం నూర్జంపేటలో వరి పొలాన్ని పశువులు మేపుతున్న రైతు కిన్నెర వీరయ్య, రణపంగ హుస్సేన్ రైతులు మాట్లాడుతూ గతంలో పరిపాలించిన ప్రభుత్వం శ్రీరాంసాగర్ కాల్వల ద్వారా కాలేశ్వరం జలాలు అందించడం వలన బోర్లలో బావులలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి పంటలు పండినాయని వారన్నారు.
ఈ కొత్త ప్రభుత్వంలో కాలేశ్వరం జలాలు రాక యాసంగి పూర్తిస్థాయిలో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా ప్రజా పాలకులు శ్రీరామ్ సాగర్ కాల్వల ద్వారా కాలేశ్వరం జలాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాపాలకులు కాళేశ్వరం జలాలు కాలువల ద్వారా విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరినారు. కాలువల ద్వారా కాలేశ్వరం జలాలు వదలక పోతే మండలంలో పూర్తిస్థాయిలో పొలాలు ఎండిపోయి కరువు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నదని రైతాంగం రైతు సోదరులు అన్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
ఓడిపోయిన కేజ్రీవాల్..!
-
District collector : జిల్లా కలెక్టర్ ని సందేహాలు అడిగిన గురుకుల విద్యార్థులు..!
-
Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం.. వేదింపులకు యువతి ఆత్మహత్య..!









