Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : చౌడమ్మ తల్లి కి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

Suryapet : చౌడమ్మ తల్లి కి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా లో పెద్దగట్టు జాతరకు ఎమ్మెల్సీ కవిత బోనం ఎత్తుకొని లింగమంతుల స్వామి జాతరకు వచ్చారు. మంగళవారం చౌడమ్మ తల్లికి ఆమె బోనం సమర్పించారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఈ సందర్భంగా లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ స్వామివారికి బోనం చెల్లించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర లింగమంతుల జాతర అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం, సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనం అన్నారు.

కేసీఆర్ హయాంలో లింగమంతుల జాతరకు 14 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆమె వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ ఏం చెప్పారంటే..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

  4. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

మరిన్ని వార్తలు