District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ ఏం చెప్పారంటే..!
District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ ఏం చెప్పారంటే..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేటలో ఈనెల 21న వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్నారని, సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పక్కాగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి దగ్గర గల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈనెల 21న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తా లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అలాగే జిల్లా మహిళా సమాఖ్య భావన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అనంతరం అప్పక్ పల్లి దగ్గర గల ప్రభుత్వ వైద్య కళాశాలలో వంద పడకల ఎం సి హెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగంతో పాటు నర్సింగ్ కళాశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు శంకుస్థాపనలు చేస్తారని, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల తర్వాత కళాశాల ముందు భాగంలో ఏర్పాటుచేసే పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారని, తిరిగి సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరతారని కలెక్టర్ తెలిపారు.
అయితే ముఖ్యమంత్రి సింగారం చౌరస్తా నుంచి మెడికల్ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు దగ్గరుండి పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. సింగారం నుంచి అప్పక్ పల్లి వరకు రోడ్డుతో పాటు ఇరువైపులా స్థలాన్ని శుభ్రంగా మార్చాలని తెలిపారు.
ముఖ్యమంత్రితోపాటు కార్యక్రమంలో పాల్గొనే వివిఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని, మధ్యాహ్న భోజనం మెడికల్ కళాశాలలోనే ఏర్పాటు చేయాలని, భోజనాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించాలని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి నారాయణపేటకు చేరుకున్న మొదలు నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఎవరెవరికి ఏఏ బాధ్యతలు అప్పగించారో వారు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు.
పబ్లిక్ మీటింగ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవికాలం మొదలైందని, మీటింగ్ కు వచ్చే జనాలకు తాగునీటి వసతి పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. డిఆర్డిఏ, టీజీ ఎమ్ ఐ డి సి, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయని ఆయా శాఖల అధికారులు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.
ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను, ముఖ్యంగా పటిష్ట భద్రత ఏర్పాట్లను చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ రామ్ చందర్ నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, టీజీఎమ్ఐడిసి ఈ ఈ సురేందర్ రెడ్డి, ఎస్. ఈ జైపాల్ రెడ్డి, ఆర్టీవో మేఘా గాంధీ, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహాసిల్దారులు పాల్గొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సింగారం చౌరస్తాలో గల పెట్రోల్ బంక్, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.
■ MOST READ NEWS :
-
Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!
-
TG News : 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 35 పైసలు కూడా తీసుకురాలేదు..!
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
District collector : ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిషేకం.. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం..!









