Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

MLC : ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికలకు పటిష్ట బందోబస్తు.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..!

MLC : ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికలకు పటిష్ట బందోబస్తు.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..!

సూర్యాపేట, మనసాక్షి

ఈ నెల 27వ తేదీన జరగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల సామాగ్రికి రక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి, అధికారులకు సూచించారు. ఎన్నికల సామాగ్రి తరలించడం, వాటికి రక్షణ కల్పించడం పోలీసు ప్రాథమిక విధి అని, మార్గం లో అన్ని స్థితిగతులు పరిశీలించాలని, ఇబ్బందులు వస్తే అధికారులకు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచార ఇవ్వాలని సూచించారు.

పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు క్యూ లైనులో ఉండాలన్నారు. పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్ లోకి వెళ్ళవద్దు అని సూచించారు. ఇతరులను పోలింగ్ బూత్ లోకి అనుమతించద్దు అన్నారు. ఈ నెల 27 వ తేదీన జరుగనున్న నల్గొండ- ఖమ్మం – వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంభందించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 23 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందనీ వివరించారు.

దీనికి సంభందించి 300 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుంది అన్నారు. ఏడు రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, 23 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశాం అన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద స్టాటిస్టికల్ సిబ్బంది ఉంటారని, సి సి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. పౌరులు, ఓటర్లు నియమ నిబంధనలు పాటించాలని ఎస్పి కోరారు.

ఓటరు గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని, క్యూ లైనులో నిల్చొని ఓటు వెయ్యాలని, ఎన్నికల సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలని, ఎవరూ తగాదాలు పెట్టుకోవద్దని, బయట ప్రచారం చేయవద్దని, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్ లోకి అనుమతి లేదు అని గ్రహించాల న్నారు. 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ (144సెక్షన్) అమలులో ఉన్నదని, పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు వెయ్యాలని కోరారు.

MOST READ :

  1. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  2. District collector : శివరాత్రి మరుసటి రోజు 27న విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవు.. ఎందుకంటే..!

  3. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!

  4. Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  5. Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!

మరిన్ని వార్తలు