Madanapalle : గోవా సీఎం మదిని దోచిన టెర్రకోట బొమ్మలు..!
Madanapalle : గోవా సీఎం మదిని దోచిన టెర్రకోట బొమ్మలు..!
మదనపల్లి, మన సాక్షి :
టెర్రకోట కుండలు, బొమ్మలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెగ మెచ్చుకున్నారు. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో గోవాలో ఇండియన్ హస్తకళల ఎగ్జిబిషన్ ప్రారంభైంది. గాంధీ శిల్ప బజార్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లుకు చెందిన టెర్రకోట హస్త కళాకారిణి దుర్గం కళావతి ఏర్పాటు చేసిన టెర్రకోట స్టాల్ ను సంద ర్సించారు. మట్టితో చేసిన వివిధ కళారూపాలను చూసి ఆశ్చర్యపోయారు.
టెర్రకోట ప్రత్యేకమైన కళయని.. వీటిని చేతితోనే తయారు చేశామని కళావతి చెప్పడంతో ఆయన మరింతగా మెచ్చుకున్నట్లు మంగళవారం తెలిపారు. శారీరక శ్రమ తోడుగా చేతి నైపుణ్యంతో సాధారణ బంక మట్టితో అధ్బుత కళారూపాలను మలిచారని ప్రశంసించినట్లు తెలిపారు.
వివిధ ఆకృతులలో ఉన్న బొమ్మలను, కుండలను చూస్తూ వాటి గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. గోవాలో టెర్రకోట బొమ్మలు, కుండలకు ఆదరణ లభిస్తున్నట్లు దుర్గం కళావతి తెలిపారు.
MOST READ :
-
Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
-
Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!









