Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : పిల్లలమర్రి లో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు..!

Suryapet : పిల్లలమర్రి లో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి :

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి మహా శివరాత్రి వేడుకలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మహాదేవ నామేశ్వరాలయంలో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, స్వస్తివాచనం, రక్షా బంధనం, అంకురారోపణ, సకల దేవతా ఆహ్వానం, కలశ స్థాపన చేశారు.

కార్యక్రమంలో దేవాలయ కమిటి చైర్మెన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి, విశ్రాంత అదనపు ఎస్పీ గంగాధర సత్యనారాయణ, చెన్నకేశవ స్వామి దేవాలయ చైర్మన్ రాజబాబు రెడ్డి, కందగట్ల రాంబాబు, గ్రామ పురోహితులు పులి హరి ప్రసాద శర్మ, దేవాలయ అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ, డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.

ప్రశాంతంగా జరుపుకోవాలి: డిఎస్పీ రవి

మహా శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రిలో జరిగే వేడుకలు భక్తి భావంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డిఎస్పి రవి సూచించారు. మంగళవారం పిల్లలమర్రి గ్రామంలో దేవాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రజలు చేశారు.

అనంతరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిఐ రాజశేఖర్ ఎస్ఐ బాల నాయకులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి ఇరువైపులా పలు దారులలో బారికేడింగ్ లు ఏర్పాటు చేసి కేటాయించిన స్థలంలో వాహన పార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

Latest News :

మరిన్ని వార్తలు