Miryalaguda : మిర్యాలగూడలో ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. చిరు వ్యాపారాలకు ప్రత్యేక మార్కెట్..!
Miryalaguda : మిర్యాలగూడలో ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. చిరు వ్యాపారాలకు ప్రత్యేక మార్కెట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన రహదారిపై ఫుట్ పాత్ లపై అడ్డదిడ్డంగా చిరు వ్యాపారం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దాంతో ఎమ్మెల్యే చిరు వ్యాపారస్తులు ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసుకునే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గురువారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజుతో కలిసి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద పరిశీలించారు. ఫ్లైఓవర్ అండర్ లో ఉన్న కాళీ స్థలాన్ని బైక్స్ పార్కింగ్, ఫ్రూట్, వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రధాన రహదారి పై ఉన్నటువంటి చిరువ్యపారులను మార్కెట్ కి తరలించే ప్రయత్నంలో అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. హౌసింగ్ బోర్డ్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు ముఖ్యంగా సాగర్ రోడ్ లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగినందువలన వీధి వ్యాపారుల తోపుడు బండ్లతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పడం లేదన్నారు.

తోపుడుబండ్ల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఫ్లైఓవర్ కింద అన్ని సౌకర్యాలతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నిశ్చయించామన్నారు. కొన్ని ఖానాలలో డీసీఎంలు, బొలెరోలు, జెసిబి లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, మిర్యాలగూడ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని కోరుతున్నామన్నారు.
ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడమే పనిగా ప్రతిపక్షాలు ఉండటం శోచనీయమని, విపరీతంగా పెరిగిన పట్టణ ప్రజల సౌకర్యం కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించగా, దానిని తప్పుడు ప్రచారం చేయటం ప్రతిపక్ష పార్టీల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
మిర్యాలగూడ అభివృద్ధి కోసం తమ అనుభవంతో ఎలాంటి సలహాలు ఇచ్చిన పాటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారి వెంట తాసిల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ యూసఫ్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!
-
TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
-
Brothers : ఈ అన్నదమ్ములకు పేదరికమే తలవంచింది..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!









