TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : స్పీడ్ బ్రేకర్ తప్పించే ప్రయత్నంలో.. ప్రమాదంలోకి..!

Miryalaguda : స్పీడ్ బ్రేకర్ తప్పించే ప్రయత్నంలో.. ప్రమాదంలోకి..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. వాహనాల రద్దీ భారీగా పెరుగుతుంది. పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా నుంచి సాగర్ రోడ్డు, హనుమాన్ పేట ఫ్లై ఓవర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

అంతే కాకుండా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కూడా ట్రాఫిక్ నియంత్రణకు ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ వాహనదారులు అడ్డదిడ్డంగా నడుపుతూ కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు. అలాంటి వాటివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి మిర్యాలగూడ పట్టణం మీదుగా వెళుతుంది. దాంతో 100 మీటర్ల రహదారికి డివైడర్ నిర్మాణం చేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం, ఫుట్ పాత్ నిర్మాణం కూడా చేపట్టారు. కానీ రోడ్డుకు డ్రైనేజీ నిర్మాణానికి మధ్య ఉన్న స్థలంలో రోడ్డు వేయకుండా టైల్స్ వేశారు.

ఈదులగూడ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు కూడా ప్రధాన సెంటర్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అంత వరకు బానే ఉన్నప్పటికీ వాహనదారులు స్వీట్ బ్రేకర్ ను తప్పించేందుకు ఎడమవైపుకు ఫుట్ పాత్ వైపు వాహనాలను నడుపుతూ క్రాస్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుకగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి.

డ్రైనేజీ వరకు కూడా స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల వాహనదారులు స్పీడ్ బ్రేకర్ ను తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదంలోకి వెళ్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపడితే ప్రమాదాలను నివారించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

మరిన్ని వార్తలు