Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

LRS : రెండు రోజుల్లో ముగియనున్న LRS రాయితీ గడువు.. పెంపు ఉంటుందా..!

LRS : రెండు రోజుల్లో ముగియనున్న LRS రాయితీ గడువు.. పెంపు ఉంటుందా..!

మన సాక్షి, హైదరాబాద్ :

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) రుసుములో ప్రభుత్వ రాయితీ గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్నది. ఈనెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించింది. అయితే మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నది.

దాంతో దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. మరో నెల రోజులు గడువు పొడిగించాలని కోరుతున్నారు. దాంతో పాటు శాసనసభ సమావేశాల్లో కూడా ఎల్ఆర్ఎస్ గడువును పెంచాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. తొలుతగా ఎల్ఆర్ఎస్ పట్ల ప్రజల నుంచి స్పందన రాలేదు. కానీ ఆ తర్వాత మంచి స్పందన వస్తుంది.

15 రోజుల్లో కేవలం 2.80 లక్షల మంది 950 కోట్ల రుసుము చెల్లించారు. మరో రెండు రోజుల్లో 500 కోట్లకు పైగా రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరో 15 రోజులు గడువు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

MOST READ : 

  1. Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

  3. Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!

  4. PM Vidya Lakshmi : విద్యార్థులకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి.. దరఖాస్తులు ప్రారంభం..!

  5. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

మరిన్ని వార్తలు