Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : ఘనంగా తిరునగరు గంగాధర్ జయంతి..!

Miryalaguda : ఘనంగా తిరునగరు గంగాధర్ జయంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు తిరునగరు గంగాధర్ జయంతి శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సాగర్ రోడ్డు లోని గంగాధర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నాయకులు శాగ జలంధర్ రెడ్డి, రామకృష్ణ, బాసాని గిరి, రమేష్ నాయక్ పాల్గొన్నారు.

కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో :

గంగాధర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు తిరునగరు భార్గవ్, నాగలక్ష్మి, కుటుంబ సభ్యులు రాయపూడి భవాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!

  2. Heart care : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఇవి తినండి..!

  3. TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!

  4. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

  5. ACB : కలెక్టరేట్ లో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్..!

మరిన్ని వార్తలు