Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsరంగారెడ్డిహైదరాబాద్

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కారులో ఆడుతుండగా డోర్ లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కారులో ఆడుతుండగా డోర్ లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

కారు లాక్ కావడంతో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల ప రిధిలోని పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన మామయ్య తెలుగు రాంబాబు పెళ్లి (ఈ నెల 30న) నిమిత్తం చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామానికి వచ్చారు.

ఇంటి ఎదుట ఉన్న రాంబాబు కారులో ఇద్దరు పిల్లలు సోమవారం మధ్యాహ్నం 12:30 నిమిషాల ప్రాంతంలో ఎక్కారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఇది గమనించ లేదు. బయట ఎక్కడో ఆడుకుంటున్నారని భావించారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారులో చూడగా ఆ ఇద్దరు చిన్నారులు స్పృహ తప్పి పడి ఉన్నారు. లాక్ తీసి కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ పిల్లల తల్లితండ్రుల రోదనలతో ఆసుపత్రి ప్రాగణం దద్దరిల్లింది. ఇద్దరు చిన్నారుల మృతితో రెండు గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం..!

  2. WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్ అదిరిపోయింది.. ఇక లొకేషన్ షేరింగ్..!

  3. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  4. Summer Tips: ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..!

మరిన్ని వార్తలు