Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో హడల్.. కీలక ఆదేశాలు..!

Nalgonda : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో హడల్.. కీలక ఆదేశాలు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాలలో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు తీరును పరిశీలించిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాలలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు , పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరు మెచ్చుకుంటున్నారని అన్నారు. అంత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని, అదేవిధంగా చౌకధర దుకాణాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు వంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగున్నాయని, అలాగే దేవరకొండ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెనూ ప్రకారం భోజనం, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు.

నిబంధనల ప్రకారమే విద్యార్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, దీని ద్వారా జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినందన తెలియజేశారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రి లో రోగులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని, స్టోర్ రూమ్ కమిషన్ సభ్యులతో కలిసి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి 100 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 180 మంది వస్తున్నారని , 200 పడకల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేసామని డిసిహెచ్ మాతృనాయక్ తెలిపారు.

అయితే రాష్ట్ర ఆహార కమిషన్ ద్వారా 200 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు తమవంతు కృషిగా లేఖ రాస్తామని చైర్మన్ తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ఆహార కమిషన్ దేవరకొండలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు .6 వతరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి ఆహార కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, భోజనం బాగుందా? గుడ్డు ఇస్తున్నారా ?నాన్ వెజ్ ఎప్పుడు పెడుతున్నారని? విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థినిలకు అప్పుడప్పుడు రక్త పరీక్షలు నిర్వహించాలని, దీనిద్వారా రక్తహీనతను తెలుసుకొని వారికి సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వంటగదిని తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం ఏమిచ్చారని? అడగగా టమాట రైస్, సాంబార్ ఇచ్చామని వంట మాస్టర్ తెలిపారు. 72 మంది విద్యార్థులు ఈ హాస్టల్ లో ఉన్నారని, వార్డెన్ ఇమ్మానియేల్ తెలుపగా, గుడ్లు ఎలా ఇస్తున్నారని? సైజు ఎలాంటివిస్తున్నారని? అడగడమే కాకుండా స్టోర్ ను పరిశీలించారు.

విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి రికార్డులను నిర్వహించాలని, ఒకవేళ వారు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లయితే కమిషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసి సరైన భోజనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అమలు చేస్తున్న మెనూ, భోజనం, ఇతర వివరాలను మైనార్టీ సంక్షేమ అధికారి విష్ణు కమిషన్ కు వివరించారు.

ఇక్కడ అమలు చేస్తున్న మెనూ, భోజనం ఇతర విషయాల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద, భారతి, జ్యోతి, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీమ్ అలీ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

  3. TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!

  5. BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

మరిన్ని వార్తలు