Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Penpahad : పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ తనికి చేసిన జిల్లా ఎస్పి నరసింహ.. కీలక ఆదేశాలు..!

Penpahad : పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ తనికి చేసిన జిల్లా ఎస్పి నరసింహ.. కీలక ఆదేశాలు..!

పెన్ పహాడ్, మన సాక్షి:

పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా  సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించారు. స్టేషన్ రికార్డును, స్టేషన్ పరిసరాలు, వివిధ రకాల నేరాల్లో స్వాధీనం చేసుకోబడిన వాహనాలు, ఫిర్యాదుల నమోదు ప్రాథమిక దర్యాప్తు మొదలగు అంశాలను పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని ఎలాంటి సమస్యలున్నా అధికారులకు తెలపాలని కోరారు.

సిబ్బంది ప్రతిఒక్కరూ బాధ్యతగా పని చేయాలి, డయల్ 100 పిర్యాదులు, పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలపై త్వరగా స్పందించాలి అని ఆదేశించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టంగా పని చేయాలి, గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ప్రణాళికతో అమలు చేయాలని అన్నారు.

గ్రామ పోలీసు అధికారులు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా సమాచారం వచ్చేలా సమాచార వనరులు వృద్ధి చేసుకోవాలి అన్నారు. ప్రతిరోజు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు సన్నితంగా ఉంటూ పోలీస్ సేవలను అందించాలని ఆదేశించారు. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను పటిష్టంగా నిరోధించాలని ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి రవాణా చేసే వారిని బైండోవర్ చేయడం, వాహనాలు సీజ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గంజాయి రవాణా చేసిన కేసుల్లో ఉన్న నిందితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వారి కదలికలను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని సామాజిక అంశాల గురించి వివరించాలని, నేరాలకు పాల్పడితే చట్ట పరిధిలో శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తెలియజేయాలి అన్నారు.

సమస్యలు సృష్టించే వారిని గుర్తించి వారిలో మార్పు వచ్చేలా చూడాలన్నారు. దొంగతనాలు లాంటివి జరగకుండా ప్రజల్లో భద్రత పరమైన చైతన్యం తేవాలి అన్నారు, కొత్త వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే ఆశ్రయం ఇవ్వవద్దు, పోలీసు వారికి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లో ప్రజలు ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ
వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, పెన్ పహాడ్ ఎస్సై కస్తాల గోపికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ :

  1. Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!

  2. Nalgonda : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో హడల్.. కీలక ఆదేశాలు..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!

  4. Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)

మరిన్ని వార్తలు