Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ఫస్ట్ గా నిలిచారు. జూనియర్ ఎంపీసీలో ఎస్.కె అస్రా 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచింది.

జూనియర్ బైపిసి లో మేఘన 440 మార్కులకు 438 స్టేట్ ఫస్ట్, కె వంశీ సీనియర్ ఎంపీసీలో 992 మార్కులు, ఎస్ పావని 990 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో సమీనా 985 మార్కులు, ఎస్.కె సఫియా 985 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రభాగాన నిలిచినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, చైతన్య ఆనంద్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్లో, అత్యధిక సీట్లు సాధించిన సంస్థగా నిలిచిందన్నారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 460 మార్కులకు పైగా 40 మంది, జూనియర్ బైపిసి లో 430 మార్కులకు పైగా పదిమంది, సీనియర్ ఎంపీసీలో 980 మార్కులకు పైగా 20 మంది, సీనియర్ బైపీసీలో 15 మంది మార్కులు సాధించినట్లు తెలిపారు.

MOST READ :

  1. Health : మీ జుట్టు నల్లబడాలా.. చాలా సింపుల్.. ఈ నీళ్లు దివ్యౌషధం..!

  2. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

  3. Paddy Centers : కాంటాలు కావు, లారీలు లేవు, కుప్పలుగా ధాన్యం .. కొనేదెప్పుడో.. ఆందోళనలో రైతులు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  5. Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!

మరిన్ని వార్తలు