Nalgonda : అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ రూమ్ సీజ్..!
Nalgonda : అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ రూమ్ సీజ్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేని ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ రూమ్ ను దేవరకొండ ఎంఈఓ మాతృనాయక్ ఆదేశాల మేరకు విద్యాధికారి సంపత్ సీజ్ చేయడం జరిగింది.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్స్ సెంటర్ పై ఎస్ఎఫ్ఐ నాయకులు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంపై విచారణలో భాగంగా సోమవారం అనుమతులేని పాఠశాలను సిజ్ చేయడం జరిగింది అని విద్యాశాఖ అధికారి సంపత్ తెలియజేయడం జరిగింది.
ఎంఈఓ మాతృనాయక్ మాట్లాడుతూ..దేవరకొండ పట్టణంలో అనుమతి లేని పాఠశాలలో ఎవ్వరు కూడా చేరి మోస పోవద్దు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాల వైపే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
MOST READ :









