Hyderabad : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
Hyderabad : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం (మే 21) హయత్ నగర్ లోని కుంట్లూరు రోడ్డులో ఎదురెదురుగా డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల ప్రకారం.. కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాధ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం రాత్రి పెద్ద అంబర్పేట్ లోని ఓ ఫంక్షన్ కు వెళ్లిన మృతులు రాత్రి నారపల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. ఉదయం తమ గ్రామం కుంట్లూరు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కుంట్లూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. చనిపోయిన వారు ముగ్గురు కూడా వారి కుటుంబంలో ఒక్కొక్క కొడుకులే కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాలు నమోదు అయ్యాయి.
MOST READ :
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!
-
Tomato : మార్కెట్లో టమోటా ధర చూసి షాక్ తిన్న రైతులు.. చేనులోనే వదిలేసిన టమాటాలు..!
-
Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!










