Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

MSME: ఎంఎస్ఎంఈ రంగానికి పటిష్టంగా రుణ మద్దతు.. కనిష్టానికి చేరిన ఎగవేతలు..!

MSME: ఎంఎస్ఎంఈ రంగానికి పటిష్టంగా రుణ మద్దతు.. కనిష్టానికి చేరిన ఎగవేతలు..!

ముంబై:

భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రంగానికి అందించిన వాణిజ్య రుణాల పోర్ట్‌ఫోలియో గణనీయ వృద్ధి సాధించింది. 2025 మార్చి 31 నాటికి ఇది వార్షికంగా 13 శాతం పెరిగి, రూ. 35.2 లక్షల కోట్లకు చేరింది. 2024 మార్చి చివరి నాటికి రూ. 31 లక్షల కోట్లుగా ఉంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సిడ్బి (SIDBI) సంయుక్తంగా విడుదల చేసిన మే 2025 ఎంఎస్ఎంఈ పల్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుత రుణగ్రహీతలకు మరింతగా రుణాలివ్వడం ఈ వృద్ధికి ప్రధాన కారణం. ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 50 కోట్ల వరకు రుణాలు తీసుకున్న సంస్థలు ఉన్నాయి.

ఎగవేతలు ఐదేళ్ల కనిష్టానికి

ఎంఎస్ఎంఈ రంగంలో శుభ పరిణామంగా బ్యాలెన్స్-స్థాయి తీవ్ర ఎగవేతలు ఐదేళ్ల కనిష్టానికి తగ్గాయి. గడువు తేదీ తర్వాత 90 నుంచి 720 రోజులు దాటిపోయి, ‘సబ్-స్టాండర్డ్’గా నమోదైన రుణాల పరిమాణం 1.8 శాతానికి చేరింది. ఇది 2024 మార్చిలో నమోదైన 2.1 శాతం నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గుదల.

రూ. 50 లక్షల నుంచి రూ. 50 కోట్ల వరకు రుణాలు తీసుకున్న రుణగ్రహీతల సెగ్మెంట్ ఈ మెరుగుదలకు దోహదపడింది. అయితే, రూ. 10 లక్షల వరకు రుణాలు తీసుకున్న సెగ్మెంట్‌లో తీవ్రత కాస్త పెరిగింది. 2024 మార్చిలో 5.1 శాతంగా ఉండగా, 2025 మార్చి నాటికి 5.8 శాతానికి పెరిగింది. అలాగే, రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు రుణాలు తీసుకున్న సెగ్మెంట్‌లో కూడా ఎగవేతల స్థాయి స్వల్పంగా పెరిగి 2.9 శాతానికి చేరింది. 2024 మార్చి నాటికి ఇది 2.8 శాతంగా ఉంది.

కొత్త రుణాలలో తగ్గిన వృద్ధి, న్యూ-టు-క్రెడిట్ ఎంఎస్ఎంఈల ప్రాధాన్యత

2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో వాణిజ్య రుణాలకు డిమాండ్ 11 శాతం పెరిగింది. ఎంక్వైరీల సంఖ్య ఆధారంగా ఈ పెరుగుదలను అంచనా వేయబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన కమర్షియల్ క్రెడిట్ సరఫరా (విలువపరంగా) 3 శాతం పెరిగింది. అయితే, గత త్రైమాసికంలో (2025 జనవరి-మార్చి) ఇది వార్షిక ప్రాతిపదికన 11 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల మధ్య రుణదాతలలో రుణాలపై పెరుగుతున్న ఆందోళనలను ఇది ప్రతిబింబిస్తుంది.

కొత్త రుణాలు నెమ్మదించినప్పటికీ, కొత్తగా క్యాష్ క్రెడిట్ సదుపాయాల ద్వారా రుణాన్ని అందించడం ఆ త్రైమాసికంలో పటిష్ఠంగా 7 శాతం వృద్ధి కనబర్చింది. మొత్తం కొత్త రుణాల మంజూరులో (ఒరిజినేషన్) న్యూ-టు-క్రెడిట్ (ఎన్‌టీసీ) ఎంఎస్ఎంఈ రుణగ్రహీతల వాటా 2025 మార్చి నాటికి పటిష్ఠంగా 47 శాతంగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో నమోదైన 51 శాతంతో పోలిస్తే ఇది కొంత తక్కువ.

2025 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్‌టీసీ రుణాలలో 60 శాతాన్ని అందించాయి. ఎన్‌టీసీ రుణగ్రహీతలలో అత్యధిక వాటా ట్రేడ్ రంగానిది ఉండగా, వాణిజ్య రుణాలు తీసుకుంటున్న ఎన్‌టీసీ రుణగ్రహీతల సంఖ్య తయారీ రంగంలో అత్యధికంగా (70 శాతం) పెరిగింది.

రంగాల వారీగా రుణ పంపిణీ, భౌగోళిక ప్రాధాన్యత

2025 మార్చి త్రైమాసికంలో విడుదల చేసిన మొత్తం కొత్త రుణాలలో తయారీ రంగం వాటా 23 శాతంగా ఉంది. ఒరిజినేషన్‌లో మాత్రం అత్యధికంగా 34 శాతం వాటా నమోదైంది. అయితే, విలువపరంగా ఒరిజినేషన్స్‌లో తయారీ రంగం వాటా గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. ప్రొఫెషనల్స్, ఇతర సర్వీసులు, ఇతర రంగాల వాటా పెరిగింది. ప్రస్తుతం విడుదల చేసిన కొత్త రుణాలలో వీటి వాటా 36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో ఐదు పర్సంటేజీ పాయింట్ల మేర పెరిగింది.

వాణిజ్య రుణాలలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ఆధిపత్యం కొనసాగింది. 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో విలువపరంగా మొత్తం ఒరిజినేషన్స్‌లో వీటి సంయుక్త వాటా 48 శాతంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో ఒరిజినేషన్స్‌లో తయారీ రంగ వాటా ఎక్కువగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఒరిజినేషన్స్‌లో వాణిజ్య రంగం వాటా ఎక్కువగా ఉంది.

అధికారుల అభిప్రాయాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ మిట్టల్ మాట్లాడుతూ, “ఉద్యోగావకాశాల కల్పనలో, ఎగుమతుల వృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమకు గత కొన్నాళ్లుగా రుణ లభ్యత మెరుగుపడినప్పటికీ ఇప్పటికీ రుణ అంతరాలు గణనీయంగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు మద్దతు కల్పిస్తే పరిశ్రమ వృద్ధికి, మన దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు లభిస్తుంది.

కొత్త ఆవిష్కరణలను, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఆర్థిక వనరుల లభ్యతను మెరుగుపరచడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడేలా ఎంఎస్ఎంఈలకు సాధికారత కల్పించవచ్చు. దీనితో పరిశ్రమ పటిష్ఠమై, సుస్థిర ఆర్థికాభివృద్ధికి, దేశవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి దోహదపడగలదు” అని అన్నారు.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ, సీఈవో భావేష్ జైన్ మాట్లాడుతూ, “ఎంఎస్ఎంఈలు నిలకడగా వృద్ధిని సాధించాలంటే సాంప్రదాయక రుణాలను పొందడంలో సహాయం, రుణాల నిర్వహణలో మార్గదర్శకత్వం లభించాలి.

అలాగే ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు తగినన్ని ఆర్థిక వనరులు లేదా అవసరమైన మద్దతు లేకపోవడంతో బిజినెస్ సైకిల్‌పరంగా వచ్చే హెచ్చుతగ్గులు ఈ సంస్థలపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ రంగానికి మద్దతు అందించడం, ఆర్థికాంశాలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన సాధనాలను సమకూర్చడం కీలకం” అని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

  1. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

  2. Vi : వీఐ నుంచి అదిరిపోయే ఫ్యామిలీ ప్లాన్.. కేవలం రూ.299కే..!

  3. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  4. Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

  6. TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!

  7. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

మరిన్ని వార్తలు