Fake seeds : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..!
Fake seeds : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న ముగ్గురు నింధితులను , అరెస్టు చేసినట్లు ఎస్పీ కే నరసింహ తెలిపారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వివరించారు. నిధితుల నుండి
సుమారు 4,62,000/- లక్షల విలువైన 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నమన్నారు..
తిరుమలగిరి పట్టణానికి చెందిన సింగారపు యాదగిరిస్వామి తిరుమలగిరి శివారులో తన భూమి చుట్టు ఉన్న వారి భూములు కౌలుకు తీసుకొని, ప్రత్తి పంట సాగు చేసుకుంటూ, ఎక్కువ దిగుబడి రాక, పండించిన పత్తి నుండి గింజలు వేరు చేసి, వాటిని పత్తి విత్తనాలు తయారు చేయవచ్చు అని యూట్యూబ్ లో చూశారని,, ఆ విదంగా చేసి వాటిని ఒరిజినల్ బి టి III విత్తనాలు అని నమ్మించి రైతులకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలని ఉద్దేశంతో, అతను అనుకున్న ప్రకారం అతను పండించిన పత్తి నుండి పత్తి గింజలు తీసి,
నకిలీ పత్తి విత్తనాలు తయారు చేయడానికి కావలసిన సామగ్రి, అనగా 3 ఫేజ్ ½ హెచ్ పి మోటార్, దానిని కలపడానికి డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యానులు మరియు పత్తి గింజలు రంగు రావడానికి షైన్ స్టార్ డబ్బాలు తీసుకవచ్చి, ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమి వద్ద పెట్టి, సుమారు 308 కేజీ ల పై చిలుకు నకిలీ పత్తి విత్తనాలు తయారు చేశారాని తెలిపారు.
అతని పరిచయం ఉన్న నందాపురం గ్రామానికి చెందిన నవీన్ మరియు చిర్రగూడూరు గ్రామానికి చెందిన సోమనరాయణలకు కలిసి, అతని వద్ద పత్తి గింజలు ఉన్నాయని,వాటిని తయారు చేసినాను, ఎక్కువ దిగుబడి వస్తాయి, కంపెనీకి కన్నా తక్కువ రేటుకు ప్యాకెట్ 1500 రూపాయలకు అమ్ముతాను, వాటిని తీసుకపోయి ఎక్కువ రేటుకు అమ్ముకొమ్మని చెప్పి, వారికి మొదటగా 10 కేజీల చొప్పున ఇద్దరికీ ఇచ్చినాడు.
వారు వాటిని అమ్మి, మళ్ళీ కావాలి అని చెప్పడంతో లోడంగి నవీన్ కు మరొక 50 కేజీ లు మరియు చిత్తలూరి సోమ నారాయణ కి కూడా 40 కేజీ ల నకిలీ విత్తనాలు అమ్మినారు.పోలీసులకు అందిన పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలిస్ వారు నిందితుల వ్యవసాయ భూముల వద్ద మరియు ఇండ్లలో దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు స్వాదినం చేసుకుని ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు.
రైతులకు వ్యవసాయానికి నష్టం కలిగే విధంగా నకిలీ విత్తనాలు అమ్మితే భారతీయన న్యాయ సంహిత, నిత్యవసర సరుకుల దుర్వినియోగం చట్టం, ఎనిమల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని , పీడీ యాక్ట్ నమోదు చేస్తాం అన్నారు. ఇలాంటి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి అరుగాలం కష్ట పడి ఒక్కరైతు కూడా నష్టపోవద్దు అని కోరారు.
నిందితుల వివరాలు
ఏ -1 సింగారపు యాదగిరి స్వామి తిరుమలగిరి మున్సిపాలిటీ,
ఏ -2. లొడంగి నవీన్ నందపురం గ్రామం తిరుమలగిరి మున్సిపాలిటి
ఏ -3.చిత్తలూరి సోమనారాయణ చిర్రగూడూరు గ్రామం అడ్డగూడూరు మండలం, యాదాద్రి భోనగిరి జిల్లా
నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పని చేసిన సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్ ఐ హరికృష్ణ, ఏ ఎస్ ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్ణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల ఉన్నారు. తిరుమలగిరి పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ రవిందర్ రెడ్డి, డీస్పీ ప్రసన్న కుమార్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, తిరుమలగిరి ఎస్ ఐ వెంకటేశ్వర్లు, సి సి ఎస్ ఎస్ ఐ హరికృష్ణ, సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!
-
Miryalaguda : ఆ విత్తనాలు వేస్తే రైతులకు 15 శాతం అధిక దిగుబడి..!
-
Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!










