Kanagal : తాను మరణించినా.. మరొకరికి దారి చూపిన హెడ్ కానిస్టేబుల్..!
Kanagal : తాను మరణించినా.. మరొకరికి దారి చూపిన హెడ్ కానిస్టేబుల్..!
కనగల్ , మన సాక్షి:
విధివశాత్తు మన జీవన ప్రయాణం సగంలోనే ఆగిపోవచ్చు. మరణించాక మన అవయవ దానం మరొకరికి మళ్ళీ పునర్జన్మనివ్వొచ్చు. మరణించి మరొకరికి చూపునిచ్చాడు హెడ్ కానిస్టేబుల్ బొల్లేపల్లి సైదులు. నల్లగొండ జిల్లా, కనగల్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బొల్లేపల్లి సైదులు రోడ్డు ప్రమాదంలో మంగళవారం దుర్మరణం చెందాడు.
కనగల్ ఎస్సై విష్ణుమూర్తి మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడంతో కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ఐ డొనేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యుల సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.
నేత్రదానంతో ఇద్దరు కార్నియా లోపం ఉన్న అంధులకు వెలుగు చూసే అవకాశం దక్కింది. 127 వ కంటి దానంగా, 254వ కార్నియా కంటి పొరల సేకరణలో సైదులు పేరు నమోదయింది. మరణించినా ఇద్దరికి చూపునిచ్చి మళ్లీ జీవించాడు. అవయవదానంపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని చైతన్యపరిచి మృతి చెందిన తర్వాత అవయవ దానం చేసే విధంగా అవగాహన కల్పిస్తే చాలామంది అవయవ లోపం ఉన్నవారికి వరంగా మారుతుంది.









